మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని ఓ తండాలో జరిగిన బాలిక (15) ఆత్మహత్య కేసును పోలీసులు చేధించారు. ఇటీవల ఆ బాలికను కలిసేందుకు శివ అనే యువకుడు ఆమె ఇంటికి వచ్చాడు. ఇది చూసిన బాలిక బంధువులు శివను కొట్టారు. అనంతరం వారు బాలికపై బెదిరింపులకు దిగారు. భయపడిపోయిన ఆ బాలిక తన ఇంట్లోనే చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో పోలీసులు శివను, బాలిక బంధువులు నలుగురిని అరెస్ట్ చేశారు.