నేరవార్తలను కవర్ చేసే సమయంలో శృతిమించుతున్న టీవీ ఛానళ్లపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు వార్తలు వెగటు పుట్టిస్తున్నాయంటూ కేంద్రం అభిప్రాయ పడింది. క్రికెటర్ రిషబ్ పంత్ ప్రమాదంపై, ఇతర నేర వార్తలకు సంబంధించిన కవరేజీ హృదయం తరక్కుపోయేలా ఉందని వెల్లడించింది. వార్తల కవరేజీ విషయంలో కచ్చితంగా కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్(రెగ్యులేషన్) యాక్ట్‌ని పాటించాల్సిందేనని టీవీ ఛానళ్లకు ఆదేశించింది. రక్తపు మరకలను బ్లర్ చేయకుండానే చూపించడం, పిల్లల్ని కొట్టే వీడియోలను ప్రసారం చేయడాన్ని కేంద్రం తప్పుపట్టింది. వార్తల కవరేజీ విధానాలను మార్చుకోవాలని హితవు పలికింది.