రేపే వన్డే సిరీస్ ప్రారంభం

© ANI Photo

టీ20 సిరీస్‌ని చేజిక్కించుకున్న భారత్.. రేపటి నుంచి వన్డే పోరులో న్యూజిలాండ్‌తో తలపడనుంది. శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నాడు. ఆక్లాండ్ వేదికగా ఉదయం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. వన్డే జట్టులో ధావన్‌కి తోడు ఇన్‌ఫామ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా రానున్నాడు. పంత్ మిడిలార్డర్‌లో వచ్చే ఛాన్స్ ఉంది. అదనపు బౌలింగ్ ఆప్షన్ కోసం హుడాని ఎంపిక చేసుకోవచ్చు. ఇక న్యూజిలాండ్ జట్టులో పలు మార్పులు జరగనున్నాయి. కెప్టెన్ కేన్ విలియమ్సన్ అందుబాటులోకి వచ్చాడు. కాగా, ఈ ఏడాదిలో కేన్ ఆరు వన్డేలు మాత్రమే ఆడాడు.

Exit mobile version