తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడేమోననే అనుమానంతో సొంత తమ్ముడినే అన్న హత్య చేశాడు. ఈ దారుణం యూపీలోని కాన్పూర్లో చోటుచేసుకుంది. 5 నెలల క్రితం ధనుంజయ్ వివాహం జరిగింది. అతని తమ్ముడు శివ బహదూర్ సింగ్ కూడా అదే ఇంట్లో ఉండేవాడు. తన భార్యతో తమ్ముడికి అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ధనుంజయ్ అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. బహదూర్ సింగ్ నిద్రిస్తున్న సమయంలో కర్రతో తలపై మోదడంతో అక్కడికక్కడే మరణించాడు. నిందితుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అనుమానంతో తమ్ముడిని చంపిన అన్న

© Envato