ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు ఇకలేరు

Screengrab Twitter:

ప్రపంచంలోనే అత్యంత వయస్కురాలైన వృద్ధురాలు ఇక లేరు. జపాన్‌కు చెందిన కానే ఠనకా 119 ఏళ్ల వయసులో ఏప్రిల్ 19న మరణించారు. అయితే తాజాగా అక్కడి అధికారులు ప్రకటించారు. ఆమె 120 సంవత్సరాల వయస్సు లక్ష్యాన్ని చేరుకోకుండానే కన్నుముశారు. కానే ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా నిలించింది. 2019 మార్చి నుంచి ఠనకా ప్రపంచంలో ఎక్కువ వయస్సు కల్గిన వ్యక్తిగా ఘనతను సాధించారు. ఈమె మృతితో ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎక్కువ వయస్కురాలిగా ఫ్రాన్స్ కు చెందిన మహిళ లుసిలీ రాండన్ నిలిచారు. రాండన్ వయస్సు 118 ఏళ్ల 73 రోజులుగా ఉంది.

Exit mobile version