వీడని ‘పాక్- ఆఫ్గాన్’ మ్యాచ్ ఫీవర్

Screengrab Twitter:

మైదానంలో ప్లేయర్లు.. స్టాండ్స్ లో అభిమానులు.. సోషల్ మీడియాలో మాజీలు తగువులాడుకున్నారు. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మ్యాచ్ తతంగమే ఇది. మ్యాచ్ అనంతరం అఫ్గాన్ ఫ్యాన్స్ ప్రవర్తనపై పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందిస్తూ.. ‘ఆటలో క్రీడాస్ఫూర్తి ముఖ్యం. అప్పుడే మనం పైకి ఎదగగలం. మీ వాళ్లకి చెప్పండి’ అంటూ అప్గాన్ క్రికెట్ మాజీ చీఫ్ ని ట్యాగ్ చేశాడు. ‘భావోద్వేగాలను ఎవరూ అదుపుచేయలేరు. కబీర్ ఖాన్, ఇంజిమామ్ లను అడగండి. మేమేంటో చెబుతారు. దయచేసి ఇలాంటి మాటలొద్దు’ అని షఫీక్ బదులిచ్చాడు.

Exit mobile version