కరోనా వైరస్ మళ్లీ భారత్లో విజృంభించనున్నట్లు భారత ప్రభుత్వం దేశ ప్రజలను హెచ్చరించింది. కొత్త వేరియంట్లతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా వారానికి 35 లక్షల కేసులు నమోదవుతున్నట్లు కేంద్రం తెలిపింది. చైనా, అమెరికా, బ్రెజిల్, జపాన్ దేశాల్లో భారీగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కొత్తగా నమోదవుతున్న కేసులను జినోమ్ సీక్వెన్సింగ్ చేయాలని సూచించింది.