చైనాలోని ఒక గ్రామం ప్రపంచంలోనే సంపన్నమైన గ్రామంగా రికార్డు సాధించింది. సాధారణంగా గ్రామాల్లో ప్రజలు వెనకబడి ఉంటారన అనుకుంటారు. కానీ చైనాలోని జియాంగ్యిన్ నగరానికి సమీపంలో ఉన్న హువాజీ అనే గ్రామంలో ప్రతి వ్యక్తి వార్షిక ఆదాయం రూ.80 లక్షలకు మించి ఉంటుందట. అయితే వాళ్లందరూ కూడా వ్యవసాయంపై ఆదారపడి నివసిస్తుండటం గమనార్హం. వ్యవసాయం చేస్తూ నగరాల్లో నివసించే ప్రజల కంటే ఎక్కువగా సంపాదిస్తూ విలాసవంతంగా జీవనం గడుపుతున్నారు.