యాంకర్ అనసూయ ఫొటోలను మార్ఫ చేసి సామాజిక మాధ్యమాల్లో వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని కోనసీమ జిల్లాకు చెందిన రామ వెంకట వీర్రాజుగా గుర్తించారు. నిందితుడి నుంచి ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. అందులో అనసూయ సహా రష్మి, విష్ణుప్రియ, ప్రగతి ఫొటోలు ఉన్నాయని తెలిపారు. మరికొంత మందిని టార్గెట్ చేసినట్లు వెల్లడించారు. గతంలో అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి అరెస్ట్ చేశారు.