పాకిస్తాన్లో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో తెలిపే ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. కేవలం 1667 పోస్టులకు గానూ ఒక్క ఇస్లామాబాద్‌లోనే 30 వేల మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరందరికి వేర్వేరుగా పరీక్షలు నిర్వహించే స్థోమత లేక స్టేడియంలో నిర్వహించింది. అందరూ నేలపైనే కూర్చుని పరీక్ష రాశారు. కాగా పాకిస్తాన్లో 31 శాతం మంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగ రేటు 6.9గా ఉంది. కాగా ఇంతకుముందు కూడా ఒక్క ప్యూన్ ఉద్యోగం కోసం 15 లక్షల మంది అప్లై చేశారు.