• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చెలరేగిన షెఫాలీ; ఢిల్లీ సునాయాస విజయం

    డబ్ల్యూపీఎల్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సునాయస విజయం అందుకుంది. 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఎక్కడా తడబడకుండా చేధించింది. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 10 వికెట్ల తేడాతో గుజరాత్‌పై గెలిచింది. జట్టు ఓపెనర్ షెఫాలీ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 28 బంతుల్లోనే 76 పరుగులు చేసి సునామీ సృష్టించింది. తన ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ మెగ్ లానింగ్(17).. షెఫాలీకి సహకారం అందించింది.