గుజరాత్లో కాంగ్రెస్ దారుణ పరాజయం పాలైంది. దాదాపు 60కి పైగా సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. AAP, MIM కలిసి కాంగ్రెస్ కొంప ముంచాయి. ఇంత కాలంగా ఆదివాసీ, మైనార్టీ ఓట్లను గంపగుత్తగా దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆ ఓట్లను కోల్పోవడం బాగా చేటు చేసింది. ఆప్, ఎంఐఎం కాంగ్రెస్ ఓట్లను చీల్చడం బీజేపీకి బాగా కలిసి వచ్చింది. మరోవైపు, పాటిదార్ వర్గానికి చెందిన ఓట్లు కూడా ఈసారి బీజేపీకే పడ్డాయి. కాంగ్రెస్ను ముందుండి నడిపించే స్థానిక నేత లేకపోవడమూ ఒక కారణమైంది. దీంతో 27 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈ సారి దారుణ ఓటమి పాలైంది.