TS: బ్యాంకులు, మొబైల్, జ్యువెల్లరీ దుకాణాలే టార్గెట్గా HYDలో చోరీలకు పాల్పడుతున్న నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గతనెలలో బజాజ్ ఎలక్ట్రానిక్స్లో జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులను కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. 400కు పైగా ఫోన్లను వీరు చోరీ చేయగా.. వీరి నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.80వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కొట్టేసిన ఫోన్లను బంగ్లాదేశ్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు.