బ్రిటన్లో పార్టీ గేట్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. ప్రధాని అధికార నివాసం డౌనింగ్ స్ట్రీట్లో బోరిస్ సహాయకుల్లో కొందరు శృంగారం చేసుకున్నారనే కథనాలు సంచలనం రేపుతోంది. 2020 జూన్లో లాక్డౌన్ ఆంక్షల వేళ ప్రముఖులు పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత 2021 ఏప్రిల్ 16న ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియల ముందురోజు అక్కడే మరో పార్టీ జరిగింది. అందులో మద్యం సేవిచండమే కాకుండా రెండు జంటలు సన్నిహితంగా మెలిగి కార్యాలయం గదిలోకి వెళ్లి లైట్లు ఆర్పేశారట