సాధారణంగా దొంగలు ఇంట్లో నగదు, నగలు, వస్తువులు దోచుకెళ్తూ ఉంటారు. కానీ ఈ దొంగలు సైలెన్సర్లు దొంగిలిస్తున్నారు. అది కూడా మారుతి ఎకో మోడల్‌కు చెందిన సైలెన్సర్లను మాత్రమే దొంగిలిస్తున్నారు. అదేంటి ఒకే రకమైన కారు సైలెన్సర్‌ను దొంగిలించడం ఏంటని అనుకున్నారా ? ఆ సైలెన్సర్లలో ప్లాటినం, రోడియం, పలాడియం వంటి మెటల్స్ ఉంటాయట. వీటి ధర సుమారు రూ.91వేల వరకు ఉంటుందట. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టి దొగలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.5,50,000విలువైన 12 సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు.