హైదరాబాద్‌లో ఓ రౌడీషీటర్ పైశాచికంగా ప్రవర్తించాడు. ముజ్రాల్లో యువకులతో అర్ధనగ్నంగా డ్యాన్స్ చేయిస్తూ కత్తితో బెదిరించిన వీడియో వైరల్ అయింది. డ్యాన్స్ చేస్తుండగా యువకుల ప్రైవేట్ పార్ట్స్‌ని టచ్ చేస్తూ రౌడీషీటర్ పైశాచిక ఆనందం పొందాడు. ఈ ఘటనలో బాధితుల ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రౌడీ షీటర్‌ని అలీ-బా-ఈసా (45) గా గుర్తించారు. ఈ నెల 20న రోడ్డుపై కత్తితో హల్‌చల్ చేయడంతో హత్యాయత్నం కేసు నమోదైంది. ఆ ఘటన జరిగిన రెండు రోజులకే వీడియో వైరల్ కావడం గమనార్హం.