రక్తం దొరక్క చాలా మంది చనిపోవడం తననెంతో బాధించిందని చిరంజీవి వెల్లడించారు. ఇదే తనతో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయించేలా చేసిందని చిరంజీవి చెప్పారు. అభిమానులు లేకపోతే ఈ కార్యక్రమం విజయవంతం కాకపోయేదని చిరు అభిప్రాయపడ్డారు. ‘చిరంజీవి ఐ, బ్లడ్ బ్యాంకు’ సెంటర్ను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గెరత్ సందర్శించిన సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. 20 సార్లకు పైగా రక్తదానం చేసిన వారికి రూ.7లక్షల బీమా అందజేశామని, ఇప్పుడు గెరత్ చేతుల మీదుగా మరో 1500మందికి అందజేశామన్నారు. తన అభిమానులు ఉన్నచోట బ్లడ్ బ్యాంకు ఉన్నట్లే అని చిరంజీవి తెలిపారు.
బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు అదే కారణం: చిరంజీవి
