రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ని భారత్ కైవసం చేసుకుంది. 109 పరుగులు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా శుభారంభం చేసింది. ఓపెనర్లు గిల్, రోహిత్ రాణించారు. అర్ధ సెంచరీ చేసి రోహిత్ వెనుదిరగగా, 11 రన్స్ వద్ద కోహ్లీ ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన ఇషాన్‌తో కలిసి గిల్ పని పూర్తి చేశాడు. అయితే, ఈ మ్యాచులో భారత బౌలర్ల ప్రదర్శనే హైలైట్. ఒకొక్క బంతిని విసురుతుంటే కివీస్ బ్యాటర్ల దగ్గర సమాధానం లేకపోయింది. వరుసగా వికెట్లు సమర్పించుకుంటూ పెవిలియన్ చేరారు. స్కోర్లు: న్యూజిలాండ్ 108 ఆలౌట్. భారత్ 111/2.