తెలంగాణలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం అయ్యింది. ఖమ్మంలో సీఎం కేసీఆర్ సహా ఇతర జాతీయ నేతలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేజ్రీవాల్, భగవంత్ మాన్, విజయన్ చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్లజోళ్లు పంపిణీ చేశారు. కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి భారాస ఆవిర్భావ సభలో పాల్గొంటారు. పార్టీ జెండాతో పాటు భాజపాకు ప్రత్యామ్నాయ ఎజెండాను కేసీఆర్ ప్రకటిస్తారని సమాచారం.