రాజద్రోహం కేసులపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదని నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఏపీ సీఎం జగన్ లెఫ్టినెంట్ సునీల్ కుమార్ చేత తన మీద అన్యాయంగా రాజద్రోహం కేసు పెట్టించాడని తెలిపాడు. నేనే రాజు నేనే మంత్రి అనుకుంటే చాలా కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నారాయణ మీద కక్ష సాధించేందుకుకే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.