యువతుల అక్రమ రవాణా కేసులో పట్టుబడ్డ నిందితుడు పోలీసుల విచారణలో చెబుతున్న మాటలు షాక్కు గురిచేస్తున్నాయి. ‘ వారికి మేము దేవుడి స్ఫూర్తిని అందిస్తున్నాం. మేము ఆ అమ్మాయిలతో చేస్తున్న సెక్స్ దైవకార్యాన్ని పూర్తిచేయడమే’ అంటూ నిందితుడు పోలీసులకు వివరించాడు. అమెరికాలోని కొలరాడో సిటీలో నివసించే శామ్యూల్, గత ఆగస్టులో మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టయ్యాడు. 46 ఏళ్ల ఇతడికి 20 మంది భార్యలుండగా అందులో అత్యధికులు మైనర్లే. తనను తాను ఓ ప్రవక్తగా చెప్పుకునే శామ్యూల్ తన అనుచరుల పిల్లలను కూడా భార్యలుగా చేసుకున్నాడు. కానీ పోలీసుల విచారణలో ఆ బాలికలెవరూ అతడికి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.