దసరా సినిమా షూటింగ్ పూర్తైనట్లు నాచురల్ స్టార్ నాని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉన్నాయని చెప్పారు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ నాని సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ వ్యయంతో ఈ మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తోంది. దసరా చిత్రాన్ని మార్చి 30న రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.