దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కాంతార’ సినిమాకు పార్ట్ 2 రాబోతోంది. ఈ ఏడాది జూన్ నుంచి సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చిత్ర నిర్మాత వెల్లడించారు. వర్షాకాలం నేపథ్యంలో కొన్ని సీన్లు ఉండనున్నాయని, అందుకే చిత్రీకరణను అప్పుడు ప్రారంభిచాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు దర్శకుడు రిషబ్ శెట్టి చిత్ర పనుల్లో బిజీగా ఉన్నారని తెలిపారు. గతేడాది విడుదలైన కాంతార సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించగా, హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది.