ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జెన్సీని మించిన పరిస్థితులు ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పవన్ కల్యాణ్‌తో కలిసి దాదాపు 2 గంటలపాటు రాష్ట్రంలో తాజాపరిస్థితులపై చర్చించారు. ఎవ్వరూ సమావేశాలు పెట్టకూడదని జీవో ఇచ్చి.. వైసీపీ వాళ్లు మాత్రం యథేచ్ఛగా చేస్తున్నారని ఆరోపించారు. కందుకూరు, గుంటూరు ఘటనలు వైసీపీ కుట్రేనని విమర్శించారు. దీన్ని పోలీసులు అమలు చేశారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతకు ఉన్న హక్కులను ప్రభుత్వం కాలరాసిందని పవన్ ఆక్షేపించారు.