బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బౌలింగ్‌తో పెద్దగా రాణించని అక్షర్ పటేల్‌పై మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేయకుండా ఉంటే ఈ సిరీస్‌లో అతడి పరిస్థితి భిన్నంగా ఉండేది. అప్పుడు నేను కుల్‌దీప్ వైపు మొగ్గు చూపేవాడిని. బ్యాటింగ్‌లో రాణించిన అక్షర్‌ను తప్పించాలని నేనూ అనుకోను. క్లిష్టమైన పిచ్‌లపై తమ బ్యాటింగ్ విభాగం బలంగా ఉండాలని టీమ్‌ఇండియా భావించింది. అందుకే ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ చేసే ఆటగాళ్లతో బరిలోకి దిగింది. అయితే, అహ్మదాబాద్ టెస్టులో అక్షర్ కీలకమవుతాడు’ అని రవిశాస్త్రి అన్నాడు.