సాధారణంగా పాములు కాటేస్తే, విషం మొత్తం ఒంటి నిండా పాకి తక్షణమే మృతి చెందుతాం. కానీ బీహార్‌లోని మధోపుర్ గ్రామంలో అనూజ్ కుమార్ అనే బాలుడిని కాటేసి, క్షణాల్లోనే పాము మృతి చెందింది. వివరాల్లోకెళ్తే.. గ్రామానికి చెందిన అనూజ్ కుమార్ ఇంటి బయట ఆడుకుంటుండగా పాము కరిచింది. దీంతో ఆ బాలుడు తన తల్లికి ఏడ్చుకుంటూ వెళ్లి పాము కరిచిందని చెప్పడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ బాలుడిని కరిచిన పాము మాత్రం అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆ బాలుడిని చూసేందుకు వస్తున్నారు.