సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదానికి గురైన డెక్కన్ మాల్‌ను రేపు కూల్చివేయనున్నారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఒక్కరోజు గడువుతో కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆహ్వానించిన జీహెచ్ఎంసీ… సుమారు రూ. 33.86 లక్షల అంచనాలతో టెండర్ పిలిచింది. ఎస్కే మల్లు కంపెనీ రూ. 22 లక్షలకు కాంట్రాక్టును దక్కించుకుంది. ఇప్పటికే ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్కూళ్లు, ఆస్పత్రులతో సహా ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని సూచించారు.