భోజ్‌పురి స్టార్ హీరో పవన్ సింగ్‌పై హీరోయిన్ యామిని సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్ సింగ్ తనను లైంగికంగా వేధించాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. భోజ్‌పురి సినీ ఇండస్ట్రీలో యామిని సింగ్ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవన్ సింగ్ సరసన నటించేందుకు ఆమెకు అవకాశం కూడా వచ్చింది. యామిని మాట్లాడుతూ.. ‘సినిమా షూటింగ్ సమయంలో ఓరోజు రాత్రి కాల్ చేసి పవన్ సింగ్ రమ్మన్నారు. రాత్రి సమయంలో రాలేను అని చెప్పా. సినిమాలో ఉండాలని ఉందా? లేదా? అని బెదిరించారు. ఆ తర్వాత ఆ సినిమా నుంచి తప్పుకున్నా’ అని చెప్పుకొచ్చింది. యామిని వ్యాఖ్యలపై పవన్ సింగ్ ఇంకా స్పందించలేదు.