మహేశ్‌బాబు చిత్రం గురించి దర్శకుడు రాజమౌళి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. హాలీవుడ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “ సినిమా గ్లోబల్ అడ్వెంచర్‌గా రూపొందనుంది. ప్రస్తుతం కథ రాసే పనిలో ఉన్నాం. ఈ చిత్రం కోసం సీసీఏతో ఒప్పందం చేసుకున్నా. దాని ద్వారా ప్రపంచ సినిమాను అర్థం చేసుకోగల ప్రతిభావంతులు పరిచయం అయ్యారు. ఏం చేయాలి? సినిమా ఎలా చేయాలి? అనేది ఫైనల్ చేసేందుకు కాస్త సమయం పడుతుంది” అన్నారు.