నెట్‌ఫ్లిక్స్‌లో సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లలో ఒకటైన ‘స్ట్రేంజర్ థింగ్స్’ నటుడు నోవా ష్నాప్ తాను గే అని ప్రకటించాడు. టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో ద్వారా తాను అన్న విషయాన్ని నోవా వెల్లడించాడు. ‘ 18 ఏళ్లు నా గదిలోనే కుమిలిపోయిన అనంతరం నా స్నేహితులు, తల్లిదండ్రులకు నేను గే అనే విషయాన్ని చెప్పినపుడు, వారంత తమకు ముందే తెలుసని చెప్పారు’ అని నోవా వెల్లడించాడు. స్ట్రేంజర్ థింగ్స్‌లో విల్ బయర్స్‌గా నటించిన నోవా… కథలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు.