బెంగళూరు హోసకరహళ్లిలో ఓ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఓ విద్యార్థి ఫోన్లో వారి కాలేజీకి చెందిన అమ్మాయిలకు సంబంధించి ఏకంగా 1200కు పైగా వ్యక్తిగత ఫోటోలు, 2000కు పైగా వీడియోలు ఉన్నాయి. అమ్మాయిల రెస్ట్రూంలో అతడు కెమెరా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కాలేజీలో అమ్మాయిల బాత్రూంకు వెళ్తుండగా చూసిన ఓ విద్యార్థిని అతడిని ఫాలో అవడంతో ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. అతడికి మరో ఫోన్ కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అమ్మాయిల బాత్రూంలో కెమెరా పెట్టిన విద్యార్థి
