NEET PG 2021 ఆల్ ఇండియా కోటా (కౌన్సెలింగ్) కింద ఖాళీగా ఉన్న సీట్ల అంశంపై సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. మెడికల్ కాలేజీల్లో 1,456 సీట్లు ఖాళీగా ఉండమేంటని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఆయా ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీసింది. విద్యార్థుల జీవితాలతో ఆటలా అంటూ సుప్రీం వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు వైద్యశాఖ డీజీని ఆదేశించి అఫిడవిట్ దాఖలు చేయాలని తెలిపింది. ఈ అంశంపై రేపు విచారణ చేయనున్నట్లు పేర్కొంది.