జ్ఞానవాపి కేసులో వీడిన ఉత్కంఠ

© ANI Photo

జ్ఞానవాపి మసీదు పిటిషన్ పై ఉత్కంఠ వీడింది. పూజలు చేసుకునేందుకు అనుమతిచ్చే పిటిషన్ ని కోర్టు స్వీకరించింది. వారణాసి జిల్లా జడ్జి ఏకే విశ్వేశ్.. ఐదుగురు మహిళల అభ్యర్థన సమర్థనీయమేనని భావించి పిటిషన్ ని స్వీకరించినట్లు సమాచారం. నిర్మాణం లోపల శివలింగం ఉందని.. ఆ లింగానికి పూజలు చేసే హక్కును తమకు కల్పించాలని ఐదుగురు మహిళలు వ్యాజ్యం దాఖలు చేశారు. కోర్టు ఒకే అనడంతో పిటిషన్ దారులు సంబరాలు చేసుకుంటున్నారు.

Exit mobile version