ఉత్తరాది ప్రజలకు చలి వణుకు పుట్టిస్తోంది. ఉత్తర, వాయవ్య భారతంలో చలిగాలులు తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ప్రజలు భయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయం 10 గంటల వరకు చలి తగ్గట్లేదు. రానున్న మరో ఐదు రోజులు దిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ వంటి ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు మళ్లీ కమ్ముకునే అవకాశం ఉందట. రాజస్థాన్‌లోని బికనీర్‌లో 0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. మధ్యప్రదేశ్‌లోని నౌగాంగ్‌లో 0.2 డిగ్రీలకు పడిపోయింది.