భారత్‌లో బ్రిటషర్లు నిర్మించిన ఓ రైల్వే లైన్‌కు రైల్వేశాఖ నేటికీ అద్దె చెల్లిస్తోంది. మహారాష్ట్రలోని యావత్మాల్-ముర్తిజాపుర్ మధ్య ఉన్న రైల్వే లైన్‌ను బ్రిటిషర్లు నిర్మించారు. ఆ లైన్ ఇంకా వారి ఆధీనంలోనే ఉంది.1952లో రైల్వేల జాతీయీకరణ సమయంలో ఈ లైన్‌ను అధికారులు మర్చిపోయారు. దీంతో ఆనాటి నుంచి బ్రిటిషర్లకు రైల్వే శాఖ రూ.కోటి కడుతోంది. ప్రస్తుతం లైన్ అమరావతి జిల్లాలోని పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని రైల్వే అధికారులు తెలిపారు.