మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మరో అప్డేట్ని ప్రకటించింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ.. ట్రైలర్‌ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ ట్రైలర్ కోసం మెగా అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి ఆదరణను పొందుతున్నాయి. మెగాస్టార్ పరిచయ ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకంది. గ్యాంగ్ లీడర్ని పోలి ఉండేలా చిరు సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. రవితేజ కూడా నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.