తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని జగదేవ్పూర్ సమీపంలోని కాలువలో వాహనం పడిపోయి ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మరొకరు గాయపడగా.. చికిత్స కోసం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాలువలో పడిన వాహనాన్ని క్రేన్ సహాయంతో అధికారులు బయటకు తీశారు. అయితే, ప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుల వివరాలు కూడా తెలియలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దిపేట పోలీసు కమిషనర్ శ్వేతా మహంతి వెల్లడించారు.