రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా తమిళ డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కించిన చిత్రం ‘ది వారియర్’. జులై 14వ తేదీన విడుదలైన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీని ఆగష్టు 11న ఓటీటీలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం హాట్‌స్టార్ ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ మూవీ విడుదలై నెలకాక ముందే ఓటీటీలో విడుదల కానుండడం విశేషం.