తను చేసుకోబోయే యువకుడికి ముక్కు చిన్నగా ఉందని పెళ్లినే రద్దు చేసుకుంది ఓ యువతి. యూపీలోని సంభాల్ జిల్లాలో ఉన్న ఒక గ్రామంలో యువతి, యువకుడికి పెళ్లి ఖరారైంది. వరుడి కుటుంబం ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకుంది. ఈ లోగా పెళ్లికొడుకును చూసిన మహిళలు ముక్కు చిన్నగా ఉందని అనుకుంటున్నారు. ఇది విన్న పెళ్లికూతురు వరుడిని చూసి నిజంగానే ముక్కు చిన్నగా ఉందని పెళ్లికి నిరాకరించింది. కుటుంబసభ్యులు ఎంత చెప్పినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
ముక్కు నచ్చలేదని పెళ్లి రద్దు

© Envato