బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు ఆయన స్వగ్రామంలోనే చేదు అనుభవం ఎదురైంది. భక్తియార్‌పూర్‌లోని ఆసుపత్రి కాంప్లెక్స్‌లో బీహార్‌కు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు శిల్పాద్ర యాజీ విగ్రహానికి నితీష్ నివాళులు అర్పిస్తుండగా ఓ యువకుడు దాడి చేశాడు. సెక్యూరిటీ సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించినా వారిని దాటుకుంటూ సీఎంపై దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతడిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.