AP: తనను ప్రేమించట్లేదని యువతిని కత్తితో హత్యచేశాడో ఉన్మాది. ఈ ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. తూ.గో. జిల్లాకు చెందిన సూర్యనారాయణ, కోనసీమకు చెందిన దేవిక కూరాడలోని అమ్మమ్మ ల ఇంటివద్ద ఉంటున్నారు. తనను ప్రేమించాలని యువతిని వేధించగా పంచాయితీ పెట్టి యువకుడికి బుద్ధి చెప్పారు. ఈ క్రమంలో కూరాడ నుంచి బైక్పై వెళ్తున్న దేవికను పక్కా ప్రణాళికతో అడ్డగించి కత్తితో గొంతు కోయడంతో యువతి మరణించింది. అతడి వెంట యాసిడ్ బాటిల్ కూడా ఉన్నట్లు తెలిసింది.