హైదరాబాద్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను కాపాడారు. మొహిదీపట్నం రేతిబౌలికి చెందిన ఇంటర్ విద్యార్థిని అడారి హర్షిత కేబుల్ బ్రిడ్జిపై నుంచి చెరువులోకి దూకింది. గమనించిన పెట్రోలింగ్ పోలీసులు వెంటనే చెరువులోకి దూకి ఆ యువతిని ఒడ్డుకు చేర్చారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.