బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఒకప్పుడు తాను డ్రెప్రెషన్‌తో చనిపోవాలని అనుకున్నట్లు తాజాగా వెల్లడించింది. డిప్రెషన్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక తనలో తానే కుమిలి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. కానీ తన అమ్మ, తను సమస్యను గుర్తించి ధైర్యం చెప్పిందని, అందుకే తాను బతికి ఉన్నానని పేర్కొంది. తాను డిప్రెషన్‌ను ఎదుర్కొని ఈ స్థాయిలో ఉండడానికి కారణం తన అమ్మ అని, ఆ క్రెడిట్ అంతా తనకే చెందుతుందని తాజాగా ఓ ఈవెంట్‌లో తెలిపింది.