రాష్ట్ర ప్రభుత్వం మాటకు ముందు భగీరథ… మాటకు వెనుక భగీరథ అంటూ గొప్పలు చెప్పుకునేది. ఈ పథకంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని పదే పదే చెప్పేది. ఈ పథకం గొప్పతనం వివరిస్తూ వందల కోట్ల ప్రచార ఖర్చులు చేసింది. కానీ ఇవన్నీ ఉత్తవేనని తేలిపోయింది. స్వయానా మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలోని ఓ పాఠశాలకు మిషన్ భగీరథ నీరు రావడం లేదని తెలిసి అంతా షాకయ్యారు. ప్రభుత్వం ఇన్నాళ్లూ చెప్పింది ఉత్త మాటలేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ సెగ్మెంట్ లో 37 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా… కేవలం ఒకే ఒక్క పాఠశాలకు మినహా ఎక్కడా భగీరథ నీళ్లు దిక్కే లేవట. ఈ నేపథ్యంలో కేటీఆర్‌పై అంతా విరుచుకుపడుతున్నారు. 99 శాతం కనెక్షన్లు పూర్తయ్యాయని డబ్బాలు కొడితిరి కదా ఏమైంది? అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని అధికారులే స్వయాన ఆర్టీఐ ద్వారా తెలిపారు.