పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు ప్రజా విజయమని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఎన్నికలను జగన్ సర్కారుపై తిరుగుబావుటాగా చూడాలన్నారు. ‘‘ఇన్నేళ్లు రాష్ట్రం ఏం నష్టపోయిందో ప్రజలు గమనించారు. చైతన్యం, బాధ్యతాయుతంగా ఓట్లు వేశారు. నాలుగేళ్లలో జగన్ విధ్వంస పాలన కొనసాగించారు.ధనబలం, రౌడీయిజం ఎప్పటికీ శాశ్వతం కాదు. వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలిచే పరిస్థితి లేదు’’ అని చంద్రబాబు అన్నారు.