టోల్ రోడ్ ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. రానున్న రోజుల్లో హైవేపై ప్రయాణం సులభం కానుందని వెల్లడించింది. 60 కిలోమీటర్ల పరిధి వరకు ఒకసారి మాత్రమే టోల్ ఫీజును వసూలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. 60 కిలోమీటర్ల లోపు ఉన్న టోల్ బూత్‌లను మరో మూడు నెలల్లో తొలగించనున్నట్లు తెలిపింది. మరోవైపు హైవేలపై ఎక్కువగా ప్రయాణించే వారు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. వీరికి ప్రత్యేకంగా పాస్ తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ విధానం రాబోయే 3 నెలల్లో అమలు చేస్తామని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.