బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రస్తుతం ప్రెగ్నన్సీతో ఉన్న సంగతి తెలిసిందే. ప్రెగ్నెన్సీతో ఉన్న సమయంలో కూడా ఈ భామ మూవీ షూటింగ్స్, ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. తాజాగా ‘డార్లింగ్’ మూవీ ప్రమోషన్‌లో పాల్గొన్న ఆమెకు.. ప్రెగ్నన్సీ సమయంలో విశ్రాంతి తీసుకోరా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆలియా.. ‘నేను ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నంత వరకు విశ్రాంతి తీసుకోను. నాకు 100 సంవత్సరాలు వచ్చే వరకు పని చేస్తూనే ఉంటాను. పని చేయడం నాకు ఆనందాన్ని ఇస్తుంది’ అంటూ సమాధానమిచ్చింది.