తన తండ్రిని చంపిన వారిని వదిలే ప్రసక్తే లేదని దివంగత ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి అన్నారు. ‘‘తప్పు చేసిన వారికి తప్పక శిక్ష పడాలి. నా తండ్రిని ఎవరు చంపారో ప్రజలకు తెలియాలి. ఈ కేసులో నిజాలు బయటకు రావాలి. నా కుటుంబసభ్యులపై ఆరోపణలు చేస్తున్నానని నాకు తెలుసు. తన తండ్రి హత్య కేసులో వారి ప్రమేయం ఉందని నేను నమ్ముతున్నాను. తప్పు చేసిన వారికి శిక్ష పడితేనే ఇలాంటివి మళ్లీ పునరావృతం కావు.’’ అంటూ సునీత పేర్కొన్నారు.