దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే ప్రమాణిక సమయాన్ని అనుసరించేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉంది. దేశంలోని టెలికాం సర్వీసులు, బ్యాకింగ్ సేవలను ఇండియన్ స్టాండర్డ్ టైం(IST)తో అనుసంధానించేలా ప్రణాళికలు రచిస్తోంది. వీటితో పాటు వీటితో పాటు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, స్టాక్‌ఎక్స్చేంజ్, పవర్ గ్రిడ్లను ISTతో అనుసంధానించాలని భావిస్తోంది. అయితే టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు ఇది తప్పనిసరికాదు. ఇవి GPS ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి.