పరాజయంలోనే జయం ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు తానొక ఫెయిల్యూర్ పొలిటిషియన్నని, రాజకీయాల్లో విఫలం చెందానని చెప్పుకోవడంలో మొహమాట పడబోనని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లోని శిల్పకళావేదికలో జరిగిన సీఏ విద్యార్థుల అంతర్జాతీయ సదస్సులో పవన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ‘ఫేసింగ్ ది ఫ్యూజర్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ‘పేరు, డబ్బు ఉన్నవాళ్లందరూ గొప్పవారని అనుకోవద్దు. నా పరాజయాల గురించి నిర్భయంగా మాట్లాడతా. ఇప్పటివరకు నేనొక ఫెయిల్యూర్ పొలిటిషియన్. అయితే పరాజయంలోనే జయం ఉంటుంది’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు.